తెలంగాణ

telangana

ETV Bharat / state

Kishan reddy: 'న్యాయ వ్యవస్థ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు' - Kishan reddy on highcourt

కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Justice Nv Ramana)తో సంప్రదించి… తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.

kishan reddy
kishan reddy

By

Published : Jun 9, 2021, 9:50 PM IST

తెలంగాణ న్యాయ వ్యవస్థ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి (Kishan reddy) ఓ ప్రకటనలో వ్యాఖ్యానించారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Justice Nv Ramana)తో సంప్రదించి… తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కి పెంచాలన్న చిరకాల డిమాండ్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

కేంద్రమంత్రిగా తాను గతంలో అనేక సార్లు న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని ప్రతిపాదనలు చేసినట్లు ఆయన చెప్పారు. ఈరోజు కేంద్ర న్యాయశాఖ మంత్రి... తన సమక్షంలో ఫైలును ఆమోదించారన్నారు. ఈ సందర్భంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలియచేశారు. న్యాయవాదుల సంఖ్య పెరగడంతో న్యాయ ప్రక్రియ మరింత వేగవంతం చేయడంలో తెలంగాణ హైకోర్టు కచ్చితంగా దేశానికి స్ఫూర్తిదాయకం నిలుస్తుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details