తెలంగాణ

telangana

ETV Bharat / state

Tirumala Darshan Tickets: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల - Thirumala Srivari news

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల

By

Published : Oct 22, 2021, 9:23 AM IST

Updated : Oct 22, 2021, 9:39 AM IST

09:21 October 22

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల(TTD TICKETS)ను తితిదే విడుదల చేసింది. సర్వదర్శనం టికెట్లను ఆన్‌లైన్ ద్వారా విడుదల చేశారు. వర్చువల్‌ క్యూ పద్ధతిలో దర్శన టికెట్లు విడుదల కాగా... వర్చువల్ క్యూ, వోటీపీల ద్వారా టిక్కెట్లను కేటాయిస్తారు. సర్వర్లపై ఒత్తిడి తగ్గించేందుకు వర్చువల్ క్యూ విధానంలో టికెట్లు అందిస్తారు. నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి రోజుకు 12 వేల టికెట్లు చొప్పున రూ.300 టికెట్లు(TTD TICKETS) విడుదల అయ్యాయి. కేవలం నవంబర్ నెలకు మాత్రమే సంబంధించిన సర్వదర్శనం టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు.

  • బీ అలర్ట్..

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌ పేరిట శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి నకిలీ టిక్కెట్లు జారీ చేసి మోసం చేశారంటూ బాధితులు ఇటీవలే ఏపీలోని గుంటూరు అర్బన్‌ ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు... గుంటూరు వెంకటాద్రిపేటకు చెందిన నరేంద్ర ఒక బ్యాంక్‌లో పని చేస్తున్నారు. విజయవాడకు చెందిన అజయ్‌ ఫైనాన్స్‌ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వారి బంధువును తిరుమలలో శ్రీవారి దర్శనానికి టిక్కెట్లు కావాలని అడిగితే అతను గుంటూరులోని నల్లపాడుకు చెందిన ఒక వ్యక్తి సెల్‌ నంబర్‌ ఇచ్చాడు.అతనికి ఫోన్‌ చేసి శ్రీవారి దర్శనం కోసం టికెట్లు కావాలని కోరారు.

  • నకిలీ ఎస్​ఎంఎస్​లతో బురిడీ...

గత నెల 15, 23వ తేదీల్లో ఖాళీలు ఉన్నాయని చెప్పాడు. ఏ తేదీన దర్శనం కావాలో చెబితే ఆ రోజు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కార్యాలయం నుంచి చేయిస్తానని తెలిపాడు. మొత్తం 15 మంది కుటుంబ సభ్యులు వెళ్లడానికి 23న టిక్కెట్లు కావాలని చెప్పారు. ఒక్కో టిక్కెట్‌కు వెయ్యి చొప్పున మొత్తం రూ.15 వేలు అడిగాడు. తిరుమలలో ఆ టికెట్​ ధర రూ.500 అని, తాము తీసుకోమని చెబితే 15 టిక్కెట్లు రూ.12,500లకు అంగీకరించాడు. ఫోన్‌పే, పేటీఎం ద్వారా నగదు బదిలీ చేశారు. ఆధార్‌ కార్డులు పంపించగా అందరికీ టిక్కెట్లు బుక్‌ చేసినట్లు సెల్‌ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపించాడు. తితిదే ఛైర్మన్‌ కార్యాలయం నుంచి జారీ చేసినట్లు అందులో ఉంది. 23న తిరుమల సన్నిధానం అతిథిగృహంలోని బ్లాక్‌ నంబర్‌ 04లో చూపిస్తే అవి నకిలీవని చెప్పి లోపలకు అనుమతించలేదు. 

Last Updated : Oct 22, 2021, 9:39 AM IST

ABOUT THE AUTHOR

...view details