గ్రామ పంచాయతీలకు మూడో త్రైమాసికం నిధులు మంజూరయ్యాయి. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులతో పాటు కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు తెలంగాణ మ్యాచింగ్ గ్రాంటు కింద నిధులు మంజూరు చేశారు. మూడు నెలలకు గాను రూ. 462 కోట్ల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది.
గ్రామ పంచాయతీలకు మూడో త్రైమాసికం నిధులు - గ్రామపంచాయతీలకు నిధులు విడుదల వార్తలు
గ్రామ పంచాయతీలకు మూడో త్రైమాసికం నిధులు మంజూరయ్యాయి. మూడు నెలలకు గాను రూ. 462 కోట్ల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది. ఈ నిధులను జనాభా ప్రాతిపదికన ఆయా గ్రామపంచాయతీలకు ఇవ్వనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.
గ్రామ పంచాయతీలకు మూడో త్రైమాసికం నిధులు
ఈ నిధులను జనాభా ప్రాతిపదికన ఆయా గ్రామపంచాయతీలకు ఇవ్వనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి:సీఎం ఆలోచనలతో మరింత అభివృద్ధి దిశగా గ్రామాలు