తెలంగాణ

telangana

ETV Bharat / state

డిగ్రీ సీట్ల భర్తీ కోసం ప్రత్యేక విడత కౌన్సెలింగ్ - third phase allotment of dost seats

ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా డిగ్రీ సీట్లను భర్తీ చేయనున్నారు. ఎంసెట్​లో ఆశించిన ర్యాంకు రాక... డిగ్రీలో చేరాలనుకుంటున్న అభ్యర్థుల కోసం ప్రత్యేక విడత చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.

third phase of dost seats allotment
డిగ్రీ సీట్ల భర్తీ కోసం ప్రత్యేక విడత కౌన్సెలింగ్

By

Published : Oct 15, 2020, 5:24 PM IST

ఎంసెట్​లో ఆశించిన ర్యాంకు రాక.. డిగ్రీలో చేరాలనుకుంటున్న విద్యార్థుల కోసం ప్రత్యేక విడత కౌన్సెలింగ్ చేపట్టాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. గురువారం నుంచి ఈనెల 26 వరకు ప్రత్యేక విడత దోస్త్ రిజిస్ట్రేషన్లకు, ఈనెల 27 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించినట్లు కన్వీనర్ లింబాద్రి తెలిపారు.

గురువారం నాడు మూడో విడత దోస్త్ సీట్లు కేటాయించారు. మూడో విడతలో 57 వేల 695 సీట్లు కేటాయించారు. మొత్తం 74 వేల 984 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా.. 7 వేల 182 మందికి దక్కలేదని కన్వీనర్ పేర్కొన్నారు. మూడో విడత ద్వారా 7 వేల 182 మంది గతంలో సీటు వచ్చినప్పటికీ.. మెరుగైన సీటు పొందారు.

మూడో విడత సీట్ల కేటాయింపు తర్వాత సుమారు రెండు లక్షల డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీటు వచ్చిన అభ్యర్థులు ఈనెల 26 వరకు ఆన్​లైన్​లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని కన్వీనర్ తెలిపారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు ఈనెల 30 నుంచి నవంబరు 4 వరకు కాలేజీలకు వెళ్లి చేరాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details