దక్షిణ మధ్య రైల్వే మూడో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ఇవాళ సనత్‌నగర్ న్యూ గూడ్స్ కాంప్లెక్స్ నుంచి ఒడిశాకు బయలుదేరింది. ఐదు ఖాళీ ట్యాంకర్లతో కూడిన ఈ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ఒడిశాలోని మెసర్స్ టాటా స్టీల్ బీఎస్‌ఎల్ లిమిటెడ్‌కు చేరనుంది. ఈ ట్యాంకర్లలో ద్రవ రూప వైద్య ఆక్సిజన్ నింపుకుని తిరిగి వస్తుందని ద.మ.రైల్వే వెల్లడించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆక్సిజన్ అవసరాలను తీర్చే క్రమంలో ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించింది.
ఒడిశాకు బయల్దేరిన మూడో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ - తెలంగాణ వార్తలు
దక్షిణ మధ్య రైల్వే మూడో ఎక్స్‌ప్రెస్ ఆక్సిజన్ కోసం సనత్‌నగర్ నుంచి ఒడిశాకు బయల్దేరింది. ఐదు ఖాళీ ట్యాంకర్లతో కూడిన ఎక్స్‌ప్రెస్ ద్రవరూప ఆక్సిజన్‌తో తిరిగి రానుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆక్సిజన్ అవసరాలను తీర్చే క్రమంలో ద.మ.రైల్వే ఈ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించింది.
రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనతో రెండు ఎక్స్‌ప్రెస్‌లను నడిపి హైదరాబాద్‌కు ఆక్సిజన్‌ను చేరవేసింది. ఇప్పుడు మూడో ఖాళీ ఎక్స్‌ప్రెస్‌ను పంపింది. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ నిర్వహణకు జోన్ ముందస్తుగా జంటనగరాల్లో సమర్థవంతమైన స్టేషన్లను గుర్తించింది. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ కోసం గ్రీన్ కారిడార్‌ను సిద్ధం చేసింది. ట్యాంకర్ల రవాణాలో ఎత్తు ప్రధానమైన అంశం. మార్గంలోని రోడ్ ఓవర్ బ్రిడ్జి, ఫ్లాట్‌ఫారం పైకప్పు, ఓవర్ హెడ్ ఎక్విప్‌మెంట్ మొదలగు వాటిని పరిగణలోకి తీసుకొని మ్యాప్‌ను సిద్ధం చేశారు. ఆక్సిజన్ ప్రాముఖ్యతను గుర్తించి ఈ రైళ్ల రవాణాను ఉన్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
ఇదీ చదవండి:కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ముగ్గురు మృతి