హైదరాబాద్ మూసాపేట్‌లోని భరత్‌నగర్ కాలనీలో ఉన్న హరిహర క్షేత్ర దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాస మూడో సోమవారం కావడం వల్ల చిన్నాపెద్ద తేడా లేకుండా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచే భక్తులు శివునికి ఏకాదశ రుద్రాభిషేకాలు, బిల్వపత్రి పూజలు చేశారు. దేవాలయ ప్రాంగణమంతా శివ నామస్మరణతో మార్మోగింది.
మూసాపేట ఆలయానికి పోటెత్తిన భక్తులు - kartika masa pujalu latest
హైదరాబాద్ మూసాపేటలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచే భక్తులు హరిహర క్షేత్ర దేవస్థానంలో ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు.
![మూసాపేట ఆలయానికి పోటెత్తిన భక్తులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5099794-658-5099794-1574063550111.jpg)
కార్తిక మాస మూడో సోమవారం.. మూసాపేట ఆలయానికి భక్తుల వెల్లువ
Last Updated : Nov 18, 2019, 5:53 PM IST