తెలంగాణ

telangana

ETV Bharat / state

చిత్రం.. మేక కడుపులో మూడో కొమ్ము - variety goat in uravakonda

Third Horn to Goat: మనం ఇంతవరకు పశువులకు రెండు కొమ్ములు మాత్రమే చూశాం. ఇక్కడ మాత్రం ఓ మేకకు వింతగా మూడో కొమ్ము ఉంది. కొమ్ములు తలపైనే ఉంటాయి కదా ఈ మేకకు మూడో కొమ్ము వింతగా పొట్టలోంచి పుట్టుకొచ్చింది. ఇంతకీ ఇది ఎక్కడంటే

మేక కడుపులో మూడో కొమ్ము
మేక కడుపులో మూడో కొమ్ము

By

Published : Nov 28, 2022, 8:00 PM IST

Third Horn to Goat: ఏపీలో మేకకు పెరిగిన మూడో కొమ్మును చూసిన రైతులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని సంతలో ఈ మేక కనిపించింది. వెలిగొండ గ్రామానికి చెందిన రైతు ఉరవకొండ సంతలోకి అమ్మకానికి తీసుకురాగా.. సంతకు వచ్చిన పాడి రైతులు ఈ మేకను చూసి ఆశ్చర్యపోతున్నారు.

అయితే ఈ మేకకు మాత్రం మూడో కొమ్ము పొట్టలో నుంచి పెరిగింది. పశుసంవర్ధకశాఖ అధికారులు మాత్రం.. జన్యుపరమైన కారణాల వల్ల ఇలాంటివి కనిపిస్తుంటాయని అంటున్నారు. జన్యు మార్పుల వల్ల కొమ్ములు ఇలా పక్కటెముకల నుంచి ఉద్భవిస్తాయని తెలిపారు.

చిత్రం.. మేక కడుపులో మూడో కొమ్ము

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details