తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్​ 2.0: రాష్ట్రవ్యాప్తంగా మూడో రోజు అమల్లోకి

తెలంగాణలో మూడో రోజు పటిష్ఠంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. వెసులుబాటు కల్పించిన 4 గంటల సమయంలో మార్కెట్లు జనసమ్మర్ధంగా మారాయి. మరోవైపు వలసకూలీలు సొంతూళ్లకు వెళ్లేందుకు బస్టాండ్లలో బారులు తీరారు.

third-day-of-lockdown-in-telangana
లాక్​డౌన్​ 2.0: రాష్ట్రవ్యాప్తంగా మూడో రోజు అమల్లోకి

By

Published : May 14, 2021, 10:00 AM IST

కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రంలో 10 రోజుల పాటు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌... మూడోరోజూ కొనసాగుతోంది. ఉదయం 6 నుంచి 10 వరకు జనం హడావుడిగా తమ పనులు ముగించుకున్నారు. ఉదయం 10 గంటల అనంతరం పోలీసులు ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు... జనం బయటకు రాకుండా చూస్తున్నారు.

డ్రోన్‌ కెమెరాలతో నిఘా పెట్టిన పోలీసులు... అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిపై కేసు నమోదు చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావోద్దని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ-పాసులు పొందినవారిని, అత్యవసరాల్లో ఉన్నవారిని మాత్రమే.. ప్రయాణాలకు అనుమతించారు. సడలింపు సమయం తర్వాత అన్ని దుకాణాలు మూతపడ్డాయి. లాక్‌డౌన్‌ వల్ల రద్దీ ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి.

ఇదీ చూడండి:లాక్‌డౌన్‌ అమలుతో కనిష్ఠ స్థాయికి చమురు విక్రయాలు

ABOUT THE AUTHOR

...view details