తెలంగాణ

telangana

ETV Bharat / state

జీహెచ్​ఎంసీలో మూడోరోజు బ్యాంకుఖాతాల్లోకి వరదసాయం - హైదరాబాద్ వార్తలు

గ్రేటర్​లో వరద బాధితులకు ఆర్థికసాయం అందించే కార్యక్రమం మూడు రోజులుగా కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే రూ.11.10 కోట్లు బాధితుల బ్యాంకుఖాతాల్లో జమ చేసినట్లు జీహెచ్​ఎంసీ అధికారులు వెల్లడించారు.

Third day of flooding financial help in bank accounts says GHMC officers
జీహెచ్​ఎంసీలో మూడోరోజు బ్యాంకుఖాతాల్లో వరదసాయం

By

Published : Dec 10, 2020, 7:23 PM IST

జీహెచ్​ఎంసీలో వరద బాధితులకు ఇవాళ ఒక్కరోజే 11,103 మందికి రూ.11.10 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మూడు రోజులుగా ఆర్థిక సాయం అందించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటి వరకు 28,436 మంది బాధితులకు రూ.28.44 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు జీహెచ్​ఎంసీ కార్యాలయం స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:రేపు హస్తినకు ముఖ్యమంత్రి కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details