తెలంగాణ

telangana

ETV Bharat / state

గోల్కొండ బోనం... కదిలింది నగర జనం.. - THIRD DAY GOLKONDA BONALU FESTIVAL HEAL IN A GRAND WAY

డబ్బు చప్పుళ్లు... శివసత్తుల శిగాలు... పోతురాజుల ఈరగోల ఆటలతో గోల్కొండ కోట సందడిగా మారింది. మహిళలు అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తున్నారు. చిన్నా పెద్ద అంతా గోల్కొండ బోనాల్లో  సరదాగా గడుపుతున్నారు.

THIRD DAY GOLKONDA BONALU FESTIVAL HEAL IN A GRAND WAY

By

Published : Jul 11, 2019, 5:29 PM IST

గోల్కొండ బోనాల సంబురాలు మూడో వారం కోలాహలంగా సాగుతున్నాయి. గురువారం తొలి బోనం అందుకున్న జగదాంబ మహంకాళి అమ్మవారికి భక్తులు మూడో బోనాన్ని ఘనంగా సమర్పించారు. వేకువ జాము నుంచే పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనం ఎత్తి అమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోటపైనే వంటలు వండుకుని ఆనందంగా పండుగను జరుపుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగుకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

గోల్కొండ బోనం... కలిదిలింది నగర జనం

ABOUT THE AUTHOR

...view details