తీన్మార్ మల్లన్న(Thinmar Mallanna) అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ... మల్లన్న టీమ్ నాయకులు హైదరాబాద్ గన్‌పార్క్ ముందు ఆందోళన చేపట్టారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతూ... ప్రభుత్వ అవినీతిని ఎండగడుతున్న తీన్మార్ మల్లన్నను అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేయడం అన్యాయమని... ఆయనను వెంటనే విడుదల చేయాలనీ తీన్మార్ మల్లన్న టీమ్ నాయకులు, అనుచరులు డిమాండ్ చేశారు.
Thinmar Mallanna: 'తీన్మార్ మల్లన్నపై పెట్టిన కేసు ఇండియాలోనే మొదటిది' - Thinmar mallanna team members protest
హైదరాబాద్ గన్‌పార్క్ ముందు తీన్మార్ మల్లన్న టీమ్ నాయకులు, అనుచరులు నిరసన చేపట్టారు. మల్లన్న అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో దోపిడీ పాలన సాగుతోందని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ పాలన సాగుతోందని... ఈ అక్రమాలను ప్రశ్నిస్తున్నందునే తీన్మార్ మల్లన్నను ప్రభుత్వం అరెస్ట్ చేసిందన్నారు. 306 రెడ్ విత్ 511 భారత దేశంలోనే మొట్ట మొదటిసారిగా తీన్మార్ మల్లన్నపై పెట్టారని... ఈ సెక్షన్‌కు కేసుకు ఏ సంబంధం లేదన్నారు. పేద ప్రజల కోసం ఎన్నిసార్లు జైలుకు వెళ్లేందుకు తీన్మార్ మల్లన్న సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కక్ష్య పూరితంగా అరెస్ట్ చేసిన మల్లన్నను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని... లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
ఇదీ చూడండి:Vanidevi: ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన సురభి వాణీదేవి