Things Observed by Ganesh 2023:పది రోజులుగా మీ అభిమానం, భక్తి పారవశ్యం చూసి నేను ముగ్దుడయ్యాను. విఘ్నాలను(Ganesh ) తొలగించడానికి వచ్చిన నేను నా ధర్మాన్ని అనుసరించి ఈ సారి మనిషి జీవన విధానంపై దృష్టి సారించాను. నేటి సమాజంలో జరుగుతున్న పరిణామాలు, దుర్ఘటనలు, వివిధ సమస్యలు ప్రజలను సతమతం చేస్తున్నాయని స్పష్టమైంది. విఘ్నాలు దూరమవడానికి జీవన విధానంలో మార్పులు అనివార్యమని గుర్తించాను. తరతరాలుగా ధర్మం నేర్పినవి అనుసరించడంలో వెనకబడిన అంశాల్లో మార్పు కోసం కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను.
పర్యావరణం : వృక్షాలు, అడవులు, జలవనరులు సంరక్షిస్తేనే మానవ మనుగడ సాధ్యమవుతుంది. సాగు పేరుతో భూమిలోకి రసాయన ఎరువులను ఇంకిస్తున్నారు. దీంతో జలవనరులు కలుషితం అవుతున్నాయి. మరోవైపు వృక్షాల నరికివేత కారణంగా వాయు కాలుష్యం ఏర్పడుతుంది. ఇవన్నీ నేటి వాతావరణ మార్పులకు కారణం. వచ్చే భారీ విపత్తుల నుంచి రక్షణ కావాలంటే.. ఇప్పటి నుంచైనా ప్రకృతిని ప్రేమించడం నేర్చుకోండి.
Ganesh 108 Prasadam Naivedyam : వినాయకుడికి 108 రకాల ప్రసాదాలు.. ఇంతకీ ఎక్కడ..?
బద్ధకం వీడండి : క్రమశిక్షణ అనేది వ్యక్తి విజయానికి దోహదం చేస్తుంది. ఉదయం నిద్రలేచి వ్యాయామం మొదలు.. రాత్రి నిద్రించేవరకు సమయానుకూలంగా పనులను నిర్వర్తించాలి. ధ్యానం,వాకింగ్, వ్యాయామం మానసిక ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి. నిద్రలేచే మొదలు తలపెట్టిన పనుల పూర్తయ్యేవరకు బద్ధకాన్ని వీడాలి.
సమయపాలన :కాలయాపన అనేది చాలా మందిలో ప్రధాన లోపంగా మారింది. విద్యార్థులు విద్యాసంవత్సరం ప్రారంభంలో కాలయాపన చేసి పరీక్షల సమయంలో సిలబస్ అంతా నెత్తిమీద పెట్టుకుంటున్నారు. ఫలితాలపై అంచనాకు వచ్చి ఒత్తిడిలో తనువు చాలిస్తున్నారు. క్రమపద్ధతిలో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఈ సమస్య ఉత్పన్నం కాదు. అలాగే అధికారులు, నేతలు రహదారి నిర్మాణాల్లో చేస్తున్న జాప్యం ప్రాణాపాయంగా మారుతోంది. దీనిని నిలువరించాలి.
ఆర్థిక ప్రణాళికలు :అప్పులతో కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే దుర్ఘటనలు కలచివేశాయి. అత్యాశ, విచ్చలవిడి ఖర్చులు ఆర్థిక కష్టాలకు కారణం. వచ్చే ఆదాయాన్ని సమర్థవంతంగా ఖర్చు చేసే పరిజ్ఞానం పెంచుకోవాలి. అవసరమేదనే గ్రహించే విజ్ఞానం అవసరం. ముఖ్యంగా బెట్టింగ్‌లు, జూదం, తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే కోరిక అప్పులు చేయడానికి ప్రేరేపిస్తోంది. చిన్నప్పటి నుంచి డబ్బు విలువ తెలియజేస్తూ, పొదుపు నేర్పించండి. అప్పు ఎలా ముప్పుగా మారుతుందో అర్థం చేయించాలి.
Devotees Rush in Khairatabad Ganesh : ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు