హైదరాబాద్ సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరధిలోని మాదన్నపేట రహదారిపై ఉన్న ఎస్‌వై మద్యం దుకాణంలో అర్ధరాత్రి దొంగలు చోరీ చేశారు. మద్యం దుకాణం పైకప్పు గ్యాస్ కట్టర్‌తో విరగగొట్టి దుండగులు దుకాణంలోకి వెళ్లారు. మద్యం బాటిళ్లు, నగదు ఎత్తుకెళ్లారు. అనంతరం సీసీ కెమెరాలను ధ్వంసం చేసి డీవీఆర్‌ను సైతం ఎత్తుకెళ్లారు.
పైకప్పు పగులగొట్టారు.. మద్యం సీసాలు ఎత్తుకెళ్లారు... - sy liquor shop thives chori
ఇంట్లో దొంగలు.. ఆలయంలో దొంగలు.. ఇప్పుడు మద్యం దుకాణంలోనూ దొంగలు. రాజధాని పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణం పైకప్పు పగలగొట్టి మరీ.. చోరీ చేశారు.
![పైకప్పు పగులగొట్టారు.. మద్యం సీసాలు ఎత్తుకెళ్లారు... Thieves in the liquor store at saidabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5278924-853-5278924-1575545446182.jpg)
మద్యం దుకాణంలో దొంగలు...
దుకాణం వెనుక భాగం నుంచి వచ్చిన దొంగలు సుమారు రూ. 50 వేల నగదు, ఖరీదైన మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారని వైన్స్ యజమాని నందు పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆధారాలు సేకరిస్తున్నారు.
మద్యం దుకాణంలో దొంగలు...
ఇదీ చూడండి : ఐఎంఎస్ కుంభకోణంలో దేవికారాణి భర్త అరెస్ట్