తెలంగాణ

telangana

ETV Bharat / state

చోరీలకు పాల్పడుతున్న భార్యభర్తలు అరెస్ట్​ - అంతర్​రాష్ట్ర నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

చోరీలకు పాల్పడుతున్న అంతర్​రాష్ట్ర నిందితులైన భార్యభర్తలను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ​నిందితుల నుంచి 26 తులాల బంగారు ఆభరణాలు, 40 తులాల వెండి ఆభరణాలు, 2 ద్విచక్రవాహనాలు, 2టీవీలు, ఒక ప్లాట్​ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

thiefs  wife husband  arrested  in hyderabad
చోరీలకు పాల్పడుతున్న భార్యభర్తలు అరెస్ట్​

By

Published : Sep 15, 2020, 9:55 PM IST

రాత్రి సమయాల్లో ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న అంతర్​రాష్ట్ర నిందితులైన కత్తి రవికుమార్​, గీతాంజలి అనే భార్యభర్తలను హైదరాబాద్​ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో వీరు ఏపీలో పలుమార్లు జైలుకు వెళ్లిరావడం జరిగిందని అన్నారు. నిందితుల నుంచి 26 తులాల బంగారు ఆభరణాలు, 40 తులాల వెండి ఆభరణాలు, 2 ద్విచక్రవాహనాలు, 2టీవీలు, ఒక ప్లాట్​ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లాకి చెందిన రవి కుమార్​ను గతంలో పలుమార్లు గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరిగిందని తెలిపారు. జైలు నుంచి విడుదలైన రవి అనంతపురం వెళ్లి అక్కడ కొద్దిరోజులు టీ స్టాల్ పెట్టడం జరిగిందని చెప్పారు. వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణ గడవకపోవడం వల్ల మళ్లీ చోరీలకు పాల్పడుతూ నల్గొండ జిల్లాలోని మల్లేపల్లికి వచ్చి అక్కడ నుంచి రాచకొండ కమిషరేట్ పరిధిలోని పలు జిల్లాలలో భార్యతో కలిసి రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు వివరించారు.

ఇదీ చూడండి:వరద బీభత్సం - జనజీవనం అస్తవ్యస్తం

ABOUT THE AUTHOR

...view details