తెలంగాణ

telangana

ETV Bharat / state

అవ్వా...నీరు కావాలంటూ వచ్చాడు..దోచుకెళ్లాడు! - robbery

దొంగలు రోజురోజుకూ తెలివి మీరిపోతున్నారు. చోరీ చేసేందుకు వాళ్లు వేసే నాటకాలు అన్నీ..ఇన్నీ కావు. దోచేయాలనే ఆలోచన వస్తే.. నంది అవార్డులు వచ్చేంతగా నటించేస్తారు. తాజాగా అలాంటి దొంగ 'నటన'తో బంగారం దోచుకెళ్లాడు ఓ కేటుగాడు. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా ఇగుడూరులో చోటుచేసుకుంది.

దొంగ

By

Published : Oct 13, 2019, 12:01 AM IST

అవ్వా అంటూ ఓ వృద్ధురాలి ఇంటికి వచ్చాడో వ్యక్తి. అసలే వర్షాకాలం ఆరోగ్యం బాగాలేదమ్మ అంటూ నమ్మించాడు. కాసేపయ్యాక మాత్రలు వేసుకోవాలి నీరు ఇవ్వండి అంటూ అడిగాడు. ఆ వృద్ధురాలు ఇంట్లోకి వెళ్తూంటే... ఆమె వెనకే వెళ్లి మెడలోని చైన్​, చేతులకు ఉన్న బంగారు గాజులను దోచుకెళ్లాడు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా ఇగుడూరు గ్రామంలో జరిగింది.

ఇగుడూరుకు చెందిన వెంకట రంగమ్మకు ఇద్దరు కుమారులు. వారు వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. రంగమ్మ అదే గ్రామంలోని ప్రధాన రహదారిపై తన సొంత ఇంటిలో ఉంటోంది. గుర్తు తెలియని వ్యక్తి మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆమె ఇంటి వద్దకు వచ్చాడు. ఆరోగ్యం బాగాలేదు... మాత్రలు వేసుకోవాలి.. తాగేందుకు నీరు ఇవ్వండి అవ్వా అని అడిగాడు. రంగమ్మ లోపలికి వెళ్తుండగా వెనకే వెళ్లి ముఖం మీద మత్తు మందు చల్లాడు. రుమాలు నోటికి అడ్డుగా పెట్టి మెడలోని బంగారు గొలుసు, చేతులకు ఉన్న బంగారు గాజులు లాక్కున్నాడు.

అంతటితో ఆగకుండా గొంతు నులిమే ప్రయత్నం చేశాడు. వృద్ధురాలు స్పృహ కోల్పోవడం వల్ల చనిపోయిందని భావించి పరారయ్యాడు. కాసేపటి తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న రంగమ్మను గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గ్రామీణ ఎస్సై రాజశేఖర్ రెడ్డి వృద్ధురాలి నుంచి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అవ్వా...నీరు కావాలంటూ వచ్చాడు..దోచుకెళ్లాడు!

ఇవీ చూడండి: 'సమ్మెలో పాల్గొన్న వారిని తిరిగి తీసుకోవద్దు'

ABOUT THE AUTHOR

...view details