ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 37 తులాల బంగారం, 50 గ్రాముల వెండి, రెండు చరవాణులు, కంప్యూటర్, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా చింతపల్లి తండాకు చెందిన జతావత్ మహేశ్ తాళం వేసి ఉన్న ఇళ్లు లక్ష్యంగా చేసుకొని... ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో కలిపి ఇతనిపై 50కి పైగా దొంగతనం కేసులు ఉన్నాయి. కంచన్‌బాగ్, సరూర్‌నగర్, మలక్‌పేట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో పలు ఇళ్లలో చోరీలు చేసినట్టు పోలీసులు వివరించారు. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతన్ని పట్టుకున్నారు.
ఇళ్లల్లో దొంగతనాలు చేస్తున్న వ్యక్తి అరెస్టు - thief-arrest-in-hyderabad
ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 37 తులాల బంగారం, 50 గ్రాముల వెండి, రెండు చరవాణులు, కంప్యూటర్, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.

ఇళ్లల్లో దొంగతనాలు చేస్తున్న వ్యక్తి అరెస్టు
Last Updated : Apr 11, 2020, 10:04 PM IST