ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి రెండేళ్ల కిందట నగరానికొచ్చాడు. కేపీహెచ్బీ కాలనీలో ఉంటూ పిల్లలకు టెన్నిస్లో శిక్షణ ఇస్తానంటూ నమ్మబలికేవాడు. పలువురితో పరిచయాలు ఏర్పరచుకుని అవకాశం కోసం ఎదురుచూసేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి దొరికిన సొత్తు ఎత్తుకెళ్లేవాడు.
ఘరానా దొండ అడ్డంగా దొరికాడు - ఘరానా దొండ అడ్డంగా దొరికాడు
టెన్నిస్ ఆటలో శిక్షణ ఇస్తానంటూ నమ్మబలికుతూ.. ఇళ్లలో చొరబడి సొత్తు స్వాహా చేస్తున్న ఓ కేడీగాడు పోలీసులకు చిక్కాడు. గతంలో పలు కేసుల్లో జైలుకెళ్లొచ్చినప్పటికీ తీరు మార్చుకోకుండా దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఎవ్వరూ లేని సమయంలో ఇళ్లలోకి చొరబడి దొరికిన దాంతో ఉడాయిస్తూ అడ్డంగా బుక్కయ్యాడు రాజమహేంద్రవరానికి చెందిన రామకృష్ణ.
thief-arrest
ఇలా చిక్కాడు
సర్దార్పటేల్నగర్ కాలనీకి చెందిన బాధితులు తీర్థయాత్రలకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన రామకృష్ణ ఇంట్లో చొరబడి బంగారం, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు దోచుకెళ్లాడు. బాధితుల తిరుగొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు రామకృష్ణను అదుపులోకి తీసుకొని రూ. 5లక్షల పైగా విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.