వరుస పండుగల నేపథ్యంలో కరోనా జాగ్రత్తలు విస్మరిస్తే ముప్పు పొంచి ఉన్నట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఒకేచోట జనం గుమిగూడటం వల్ల వైరస్ వ్యాప్తి పెరుగుతుందంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ నగరంలో 85 పట్టణ ఆరోగ్య కేంద్రాలుండగా... చాలా కేంద్రాల్లో సున్నా కేసులు నమోదవుతున్నాయి. కొన్నిచోట్ల ఒక శాతం కంటే తక్కువగానే కేసులు ఉంటున్నాయి. ప్రస్తుతం వరుసగా పలు పండుగలు రానున్నాయి. జనం రాకపోకలు పెరిగే అవకాశం ఉంది. కొనుగోళ్ల కోసం జనం రోడ్లపై బారులు తీరుతున్నారు. ఎడం పాటించడం లేదు. చాలామంది మాస్క్‌లు ధరించడం లేదు. షాపింగ్‌లో తోసుకోవడం వల్ల వైరస్ వ్యాప్తి అనేకరెట్లు ఎక్కువగా ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు.