హైదరాబాద్ మహానగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో అంటువ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు చేపట్టారు. చెరువులు, ముంపునకు గురైన ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం అధికారులు ఆయిల్ బాల్స్ వేస్తున్నారు. వరదలు ప్రవహిస్తున్నందున ఇప్పుడే వ్యాధుల ప్రభావం ఉండదని జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ చీఫ్ రాంబాబు తెలిపారు. ప్రవాహంతో లార్వా కొట్టుకుపోయి... వ్యాధులకు అవకాశముండదని వివరించారు.
'ప్రతిఒక్కరూ కాచి వడపోసిన నీటినే తాగాలి'
వారంరోజులుగా వరదలతో అతలాకుతలమైన హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేసింది. నగరంలో అంటువ్యాధులు ప్రబలకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి... యాంటీలార్వా ఆపరేషన్లు కొనసాగిస్తున్నారు.
ghmc
వర్షాలు, వరదలు పూర్తిగా తగ్గాక అంటువ్యాధుల ప్రభావముంటుందన్నారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టామని వెల్లడించారు. నీరు నిల్వఉండే ప్రాంతాలను గుర్తించి యాంటీలార్వా వేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు కాచి వడబోసిన నీటిని మాత్రమే తాగాలని చెబుతోన్న జీహెచ్‌ఎంసీ ఎంటామాలజీ చీఫ్ రాంబాబుతో ఈటీవీ భారత్ ప్రతినిధి కార్తిక్ ముఖాముఖి.
ఇదీ చదవండి :అలెర్ట్‌గా ఉండండి... అవసరమైతేనే బయటకు రండి: సజ్జనార్