Fans Fight at Padmalaya studio: సూపర్‌స్టార్ కృష్ణను కడసారి చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు తరలిరావటంతో... పద్మాలయ స్టూడియో వద్ద తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయాలపాలయ్యారు. అభిమాన నటుడు ఇకలేడని తెలుసుకున్న నటశేఖరుడి అభిమానులు కడసారి చూపు కోసం వేలాదిగా తరలివస్తున్నారు. దీంతో పద్మాలయ స్టూడియో పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.
కృష్ణను కడసారి చూసేందుకు తరలివచ్చిన అభిమానులు.. లాఠీలకు పనిచెప్పిన పోలీసులు - పోలీసులు అభిమానులకు మధ్య కాసేపు తోపులాట
Fans Fight at Padmalaya studio: లెజెండరీ నటుడు కృష్ణను కడసారి చూసేందుకు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో వారిని నియంత్రించటం పోలీసులకు కష్టతరంగా మారింది. దాంతో పోలీసులకు, అభిమానులకు మధ్య కాసేపు తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.
![కృష్ణను కడసారి చూసేందుకు తరలివచ్చిన అభిమానులు.. లాఠీలకు పనిచెప్పిన పోలీసులు Fans Fight at Padmalaya studio](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16944398-770-16944398-1668591637904.jpg)
Fans Fight at Padmalaya studio
పద్మాలయ అపార్టుమెంట్ సెల్లార్‌లో కృష్ణ పార్థివదేహం ఉంచగా... అభిమాన కథానాయకుడిని చూసేందుకు ఒక్కసారిగా తోసుకెళ్లారు. జనాలను నియంత్రించటం పోలీసులకు కష్టతరంగా మారింది. ఈ క్రమంలో పోలీసులకు, అభిమానులకు మధ్య కాసేపు తోపులాట జరిగింది. తోసుకొస్తున్న జనాలను అదుపుచేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ క్రమంలో పలువురు గాయపడ్డారు.
కృష్ణను కడసారి చూసేందుకు తరలివచ్చిన అభిమానులు.. లాఠీలకు పనిచెప్పిన పోలీసులు
ఇవీ చదవండి: