హైదరాబాద్ కుత్బుల్లాపూర్ కూరగాయల మార్కెట్లో భౌతిక దూరం పాటించకుండా ప్రజలు కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. పక్క పక్కనే నిలబడి నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. అధికారులు కూడా పట్టించుకోవట్లేదనే ఆరోపణలు వస్తున్నాయి. శాపూర్ నగర్లో ఉండే మార్కెట్‌ను పోలీసులు ఈ మధ్య కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం పక్కకు మార్చారు. కానీ ఇక్కడ భౌతిక దూరం పాటించే సూచికలు లేకపోవడంతో నిబంధనలు అటకెక్కాయి.
కూరగాయల మార్కెట్లో సుదూరంగా భౌతిక దూరం - కుత్బుబుల్లాపూర్లో కానరాని భౌతిక దూరం
హైదరాబాద్ కుత్బుల్లాపూర్ కూరగాయల మార్కెట్లో భౌతిక దూరం స్ఫూర్తి కనిపించడంలేదు. మున్సిపల్ కార్యాలయం పక్కకు మార్చిన మార్కెట్లో సూచికలు లేకపోవడంతో ప్రజలు భౌతిక దూరం నిబంధనలు పాటించడంలేదు. పక్కపక్కనే నిలబడి కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు.

కూరగాయల మార్కెట్లో సుదూరంగా భౌతిక దూరం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు చోట్ల రెడ్జోన్లు ఇంకా కొనసాగుతుండటం వల్ల తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా పోలీసులు, అధికారులు భౌతిక దూరం పాటించాలే సూచికలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.