తెలంగాణ

telangana

ETV Bharat / state

వారికి వేర్వేరు వారసత్వ ధ్రువీకరణ అవసరం లేదు: హైకోర్టు - తెలంగాణ హైకోర్టు తాజా వార్తలు

telangana high court : తల్లిదండ్రులకు చెందిన బంగారాన్ని జప్తు నుంచి విడుదల చేయడానికి ఒకే కుటుంబానికి చెందిన వారికి వేర్వేరు వారసత్వ ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఓ కేసు తీర్పులో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌భూయాన్‌, జస్టిస్‌ ఎస్‌.నందలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది.

వారికి వేర్వేరు వారసత్వ ధ్రువీకరణ అవసరం లేదు: హైకోర్టు
వారికి వేర్వేరు వారసత్వ ధ్రువీకరణ అవసరం లేదు: హైకోర్టు

By

Published : Jul 26, 2022, 6:51 AM IST

telangana high court : తల్లిదండ్రులకు చెందిన బంగారాన్ని జప్తు నుంచి విడుదల చేయడానికి ఒకే కుటుంబానికి చెందిన వారికి వేర్వేరు వారసత్వ ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదని ఐటీ శాఖకు హైకోర్టు స్పష్టం చేసింది. 2000లో ఐటీ శాఖ తమ తల్లిదండ్రుల ఇంటిపై దాడి చేసి జప్తు చేసిన 2,362 గ్రాముల బంగారాన్ని తమకు అప్పగించేలా ఆదేశాలివ్వాలంటూ అమీర్‌పేటకు చెందిన నీలేశ్‌కుమార్‌ జైన్‌, ముకేశ్‌కుమార్‌ జైన్‌లు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌భూయాన్‌, జస్టిస్‌ ఎస్‌.నందలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఐటీ శాఖ చేసిన జప్తుపై పిటిషనర్ల తల్లిదండ్రులు న్యాయ పోరాటం చేస్తూ మృతి చెందారన్నారు. కుటుంబ వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించి నగలను విడుదల చేయాలని కోరగా.. ఐటీ శాఖ నిరాకరించిందన్నారు. వేర్వేరుగా వారసత్వ ధ్రువీకరణ పత్రాలు కోరుతోందన్నారు. ఐటీ శాఖ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కుటుంబానికి చెందిన ఇతర సభ్యులు వాటా కోరే అవకాశమున్నందున విడిగా ధ్రువీకరణ పత్రాలు కోరామన్నారు. వాదనలను విన్న ధర్మాసనం వేర్వేరు ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదని, వారి నగలను వాపస్ ఇవ్వాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details