రాగల 24 గంటల్లో పశ్చిమ రాజస్థాన్, దాని పరిసర ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది. ఏపీ తీరానికి దగ్గరలో కోస్తా ఒడిశా మీదుగా 3.1 కిలోమీటర్ల ఎత్తుకు ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు వెల్లడించింది.
రాగల మూడ్రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు - Hyderabad weather center
రానున్న మూడ్రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఏపీ తీరానికి దగ్గరలో 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడిందని వెల్లడించింది.
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
రాగల మూడ్రోజులు తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి తెలిపారు. సోమవారం, మంగళవారం ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.