తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Rains news : తస్మాత్ జాగ్రత్త.. రాత్రికి పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం - తెలంగాణ వార్తలు

Telangana Rains news: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం రాత్రి పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలుచోట్ల వడగళ్లతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది. హైదరాబాద్‌లోనూ వర్షం కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ... పిడుగులతో కూడిన వర్షం పడొచ్చని హెచ్చరించింది.

Telangana Rains news, weather report
రాగల మూడ్రోజుల్లో ఉరుములు, మెరుపుల వర్షం

By

Published : Jan 10, 2022, 3:47 PM IST

Updated : Jan 10, 2022, 6:36 PM IST

Telangana Rains news : తెలంగాణలో సోమవారం రాత్రి పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని... సిరిసిల్ల, కరీంనగర్‌, జనగాం, యాదాద్రి జిల్లాల్లోనూ మాదిరి వాన పడుతుందని పేర్కొంది. పలుచోట్ల వడగళ్లతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తుందని వెల్లడించింది. హైదరాబాద్‌లోనూ వర్షం కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ... పిడుగులతో కూడిన వర్షం పడొచ్చని హెచ్చరించింది.

అక్కడక్కడా మాదిరి వర్షాలు

రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు... అదే విధంగా బుధవారం నాడు ఆదిలాబాద్‌, కుమురం భీమ్‌, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్ల వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. సోమవారం నాడు ఉపరితల ద్రోణి ఉత్తర కర్ణాటక నుంచి ఉత్తర మధ్య మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9కిమీ ఎత్తు వద్ద ఏర్పడిందన్నారు.

సిద్దిపేటలో వాన

సిద్దిపేట పట్టణంలో మోస్తారు వర్షం కురిసింది. పట్టణంలోని రోడ్లు తడిసి ముద్దయ్యాయి. రోడ్లమీదకు వరద రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముంపు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

నిజామాబాద్​లో వరుణుడి కరుణ

ఓవైపు చలికి గజగజ వణుకుతున్న తెలంగాణ ప్రజలను సోమవారం వరుణుడు పలకరించాడు. నిజామాబాద్​ జిల్లాలోని డిచ్​పల్లి, ఆర్మూర్, ఇందల్​వాయి, ధర్పల్లి, సిరికొండ మండలాల్లో వర్షం కురిసింది. జగిత్యాల జిల్లాలో పలు ప్రాంతాల్లో వాన పడింది. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్యాల, బుగ్గారం, ధర్మపురి, చందుర్తి, రుద్రంగి మండలాల్లో చిరుజల్లులు కురిశాయి.

ఇదీ చదవండి:కుటుంబం ఆత్మహత్య ఘటనలో నలుగురు వడ్డీ వ్యాపారులపై కేసు

Last Updated : Jan 10, 2022, 6:36 PM IST

ABOUT THE AUTHOR

...view details