రాష్ట్రంలో విద్యావకాశాలు సమృద్ధిగా ఉన్నాయని... రోజురోజుకు విద్యా ప్రమాణాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుటోందని తెలిపారు. భారత్-బ్రిటన్ దేశాల మధ్య ఉన్నత విద్యలో సహకారం చేసుకునేందుకు తాజ్ కృష్ణ హోటల్‌లో రెండు రోజుల పాటు జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశాలలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు స్థాపించేందుకు పలు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని పేర్కొన్నారు. విద్యా, ఉపాధి అవకాశాల గురించి ఈ సమావేశంలో చర్చించారు.
తెలంగాణలో విద్యకు విస్తృత అవకాశాలు: మంత్రి జగదీశ్ - విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి
హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్‌లో రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ముఖ్యఅథితిగా హజరయ్యారు.
http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/06-September-2019/4357639_ts-uk-edu_bhd.mp4