తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డిని సమర్థిస్తూ.. టీఎంయూ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని హైదరాబాద్ జోన్ కార్యదర్శి వెంకటేశం పేర్కొన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన టీఎంయూ జీహెచ్ఎంసీ విభాగం సమావేశంలో ఈ మేరకు స్పష్టం చేశారు. భవిష్యత్ కార్యాచరణ, సమ్మె తర్వాత ఆర్టీసీ పరిస్థితి, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో చర్చించారు.
టీఎంయూ యూనియన్‌లో చీలికలు లేవు: వెంకటేశం - tmu Chief Secretary Ashwatthama reddy latest news
తెలంగాణ మజ్దూర్ యూనియన్‌లో ఎలాంటి చీలికలు లేవని హైదరాబాద్ జోన్ టీఎంయూ కార్యదర్శి వెంకటేశం పేర్కొన్నారు. కొంతమంది అసంతృప్తులు వెళ్లినంత మాత్రాన యూనియన్ చీలిపోయినట్లు కాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డిని సమర్థిస్తూ.. టీఎంయూ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని తెలిపారు.
సమ్మె సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గ్రేటర్ జీహెచ్ఎంసీ టీఎంయూ విభాగం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా టీఎంయూ యూనియన్‌లో చీలికలు లేవని టీఎంయూ కార్యదర్శి వెంకటేశం పేర్కొన్నారు. కొంతమంది అసంతృప్తులు వెళ్లినంత మాత్రాన.. యూనియన్ చీలిపోయినట్లు కాదని స్పష్టం చేశారు. కార్యనిర్వాహక అధ్యక్షుడు థామస్ రెడ్డి తన తప్పు తెలుసుకుని.. మళ్లీ యూనియన్‌లోకి రావాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి: లాభాలే లక్ష్యంగా.. ఆర్టీసీ కార్గో పార్శిల్ కొరియర్ సేవలు