రెండు పట్టభద్రుల మండలి ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నాయని కేంద్ర ఎన్నికల కమిషన్కు పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ నిరంజన్ లేఖ రాశారు. నియోజకవర్గాలు, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల పేర్లు లేవని వివరించారు.
ఒక నియోజకవర్గానికి చెందిన ఓటర్లు మరో నియోజకవర్గంలో ఉన్నారని.. ఉదాహరణలతో కూడిన వివరాలు లేఖలో ప్రస్తావించారు. ఆ తప్పులు ఓటర్ల జాబితా చోటు చేసుకున్నట్లు వెల్లడించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఓటర్ల జాబితాను సవరించాలని విజ్ఞప్తి చేశారు.