TS Weather Report: రాష్ట్రంలో ఈ రోజు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు, ఎల్లుండి పొడి వాతావరణ ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ సంచాలకులు పేర్కొన్నారు.
TS Weather Report: రాష్ట్రంలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం - rains in telangana
TS Weather Report: రాష్ట్రంలో రెండ్రోజులుగా సూర్యుడి తాపం నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. వాతావరణం చల్లబడటంతో పాటు అక్కడక్కడా చిరుజల్లులు, వర్షం కురుస్తోంది. ఈరోజు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఈ రోజు ఉపరితల ద్రోణి.. ఆగ్నేయ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి మరత్వడ్ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి సుమారు 0.9 కి.మీ వద్ద కొనసాగుతుందని వివరించారు. శనివారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడటంతో వేసవితాపం నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. వాతావరణం చల్లబడటంతో పాటు.. అక్కడక్కడా చిరుజల్లులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
ఇదీ చదవండి:TSPSC JOBS : గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు