హైదరాబాద్ నగరంలో థీమ్ రెస్టారెంట్లూ వెలిశాయి. నగరంలో పదుల సంఖ్యలో అందుబాటులోకి వచ్చాయి. రోబోలు వెయిటర్లుగా ఉన్న రెస్టారెంట్ జూబ్లీహిల్స్‌లోని అల్కాజర్ మాల్‌లో ఉంది. ఈ తరహాలో దేశంలో ఇది మూడోది. చెన్నై, కోయంబత్తూర్‌లోనూ ఉన్నాయి. ఈ తరహా రెస్టారెంట్లలో తిన్న భోజన ప్రియులు ప్రత్యేక అనుభూతికి లోనవుతున్నారు.
చిమ్మ చీకట్లో...
చిమ్మ చీకట్లో...
టేస్ట్ ఆఫ్ డార్క్‌నెస్ ట్యాగ్‌లైన్‌తో ఉండే ఈ రెస్టారెంట్ చీకట్లో ఉంటుంది. మాదాపూర్ ఇనార్బిట్‌మాల్‌లో ఉంది. చీకట్లోనే ఆహారం వడ్డిస్తారు.
గాల్లో ఎగురుతూ.. ఆకాశాన్ని చూస్తూ..
గాల్లో ఎగురుతూ.. ఆకాశాన్ని చూస్తూ..
క్లౌడ్ డైనింగ్ రెస్టారెంట్ 2019లో మాదాపూర్‌లో ప్రారంభమైంది. నోయిడా తర్వాత ఇక్కడే ఇలాంటిది ఉంది. 160 అడుగుల ఎత్తులో నగరాన్ని వీక్షిస్తూ భోంచేయొచ్ఛు.
బీచ్ హౌస్..
బీచ్ హౌస్..
ఇసుక తిన్నెల్లో కూర్చొని భోంచేయాలను కుంటున్నారా? ఇందుకు గోవా వరకు వెళ్లక్కర్లేదు. మాదాపూర్‌లోని బీచ్ హౌస్ రెస్టారెంట్‌కు వెళ్తే చాలు.