తెలంగాణ

telangana

ETV Bharat / state

దొంగతనానికి వచ్చి బెల్​ కొట్టారు... తర్వాత దెబ్బలు తిన్నారు - శ్రీకాకుళం జిల్లా శివాలయం చోరీ పై కేసు

Theft in Shiva temple: అదృష్టం బాగాలేకపోతే అరటి పండు తిన్నా పన్ను విరుగుతుంది అన్నట్లుగా శివాలయంలో దొంగతనానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు కంగారుపడి బెల్ కొట్టి దొరికిపోయారు. అందులో ఒక దొంగ పారిపోగా.. మరొకడు పట్టుబడ్డాడు. ఆ తరువాత ఏమైందంటే!

Theft in srikakulam
శివాలయంలో చోరీ

By

Published : Nov 30, 2022, 5:19 PM IST

Theft in Shiva temple: ఎవరైనా గుట్టు చప్పుడు కాకుండా దొంగతనం చేస్తారు కానీ ఇప్పుడు చెప్పబోయే దొంగలు మాత్రం దీనికి విరుద్ధంగా దొంగతనానికి వచ్చి బెల్​ కొట్టి దొరికిపోయారు. ఆ తర్వాత అక్కడున్న వారు.. వీళ్లను పట్టుకొని చితకబాదారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో రూరల్​ ప్రాంతానికి చెందిన మామిడి వలస గ్రామంలో ఉన్న శివాలయంలోకి ఇద్దరు దొంగలు చొరబడ్డారు. కంగారులో ఉన్న దొంగలు.. ఆలయంలో ఉన్న లైట్లు ఆపేద్దామనుకొని గంటలు మోగే స్విచ్​ నొక్కారు.

ఇంకేముంది పెద్ద శబ్దం రావడంతో.. అక్కడే నిద్రిస్తున్న కొందరు విద్యార్థులు లేచి పట్టుకోవడానికి యత్నించగా ఒకరు పారిపోగా.. మరొకరు పట్టుబడ్డారు. పట్టుబడ్డవాడిని విద్యుత్ స్తంభానికి కట్టి చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. రెండు నెలల క్రితం కూడా ఈ శివాలయంలో దుండగులు హుండీని కాజేశారని గ్రామస్థులు తెలిపారు.

శివాలయంలో చోరీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details