తెలంగాణ

telangana

ETV Bharat / state

పగలు రెక్కీ... రాత్రి దొంగతనాలు - Theft in Jubilee Hills The police who held the accused

రెక్కీ నిర్వహించి ఇంటిలో దొంగతనానికి పాల్పడుతున్న దొంగను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.11.60లక్షల విలువైన ఆభరణాలు, రూ.14,500ల నగదు స్వాధీనం చేసుకున్నారు.

పగలు రెక్కీ... రాత్రి దొంగతనాలు

By

Published : Nov 19, 2019, 7:19 PM IST

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో నివసించే ఫార్మా ఇండస్ట్రీ వ్యాపారి రఘురామి రెడ్డి ఇంట్లో ఈ నెల 12న చోరి జరిగింది. సీసీ ఫుటేజ్​ల ఆధారంగా సంఘటపై జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ విచారణలో యూసుఫ్ గూడకు చెందిన మొహమ్మద్ మన్సూర్​ను పోలీసులు నిందితుడిగా గుర్తించారు. అతని వద్ద నుంచి రూ.11.60లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు, రూ.14,500ల నగదును స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడిన అతను ఈ చోరీల బాట పట్టినట్లు వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. దొంగను పట్టుకున్న జూబ్లీహిల్స్ పోలీసులను డీసీపీ అభినందించారు.

పగలు రెక్కీ... రాత్రి దొంగతనాలు

ABOUT THE AUTHOR

...view details