ఆలయంలో చోరీకి యత్నం.. కాపలాదారుపై కత్తులతో దాడి - ఈఎస్‌ఐ ఆస్పత్రి ఆవరణలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకి యత్నం
![ఆలయంలో చోరీకి యత్నం.. కాపలాదారుపై కత్తులతో దాడి theft attempt in sanath nagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8361249-538-8361249-1597039086461.jpg)
09:57 August 10
ఆలయంలో చోరీకి యత్నం.. కాపలాదారుపై కత్తులతో దాడి
హైదరాబాద్లోని సనత్‌నగర్ ఈఎస్‌ఐ ఆస్పత్రి ఆవరణలో ఉన్న బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకి యత్నం జరిగింది. విషయం గుర్తించి అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ కాపలాదారుపై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఆలయం తలుపులు, హుండీలను ధ్వంసం చేసి పరారయ్యారు. విషయం గుర్తించిన స్థానికులు కాపలాదారుడిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు.
హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు... సీసీటీవి ఫుటేజీని పరిశీలించారు. దుండగులు ముసుగులు ధరించి ఉన్నారని తెలిపారు. త్వరలోనే దొంగలను పట్టుకొని కేసును చేధిస్తామన్నారు.