తెలంగాణ

telangana

ETV Bharat / state

Sonusood: సోనూసూద్​పై అభిమానం.. చిత్రపటం అందజేసిన యువ కళాకారుడు - యువ చిత్రకారుడు

బాలీవుడ్​ నటుడు సోనూసూద్​కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కరోనా కాలంలో ఆయన అందించిన ఎనలేనివి. తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడైన సోనూపై హైదరాబాద్​కు చెందిన ఓ యువ చిత్రకారుడు తన ప్రేమను చాటుకున్నాడు. స్వయంగా ఆయన చిత్రాన్ని గీసి ముంబయికి వెళ్లి అందజేశారు.

Sonusood
చిత్రపటం అందజేసిన హైదరాబాద్ యువకుడు

By

Published : Oct 21, 2021, 5:46 PM IST

నటుడు సోనూసూద్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలపై అభిమానులు ప్రేమను చాటుకుంటున్నారు. కరోనా సమయంలో పేదలకు సేవలందించిన సోనూకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున అభిమానులున్నారు. అంతే కాకుండా ఆయన సేవలను వివిధ రూపాల్లో అభినందిస్తున్నారు.

తాజాగా హైదరాబాద్​లోని రామంతాపూర్​కు చెందిన ఓ యువ చిత్రకారుడు స్వయంగా సోనూ చిత్రాన్ని గీసి కానుకగా బహుకరించాడు. ప్రశాంత్ కుమార్ అనే చిత్రకారుడు సోనూసూద్​ చిత్రపటాన్ని వేసి... ముంబైలోని నివాసానికి వెళ్లి అందజేశారు. ఆ చిత్రపటాన్ని చూసిన సోనూ తనను అభినందించడం ఎంతో సంతోషంగా ఉందని చిత్రకారుడు ప్రశాంత్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ వస్తే తప్పకుండా కలుస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.

ఇదీ చూడండి:Sonusood: 'మీ వెంటే నేను'.. అమరావతి రైతులతో సోనూసూద్‌

ABOUT THE AUTHOR

...view details