హైదరాబాద్లోని ఎస్ఆర్నగర్, బాల్కంపేట పరిధిలోని సుమారు 60 మంది మహిళా టైలర్లు జట్టుగా ఏర్పడి మాస్కులు కుట్టి ఉచితంగా పంచుతున్నారు. వలస కూలీలకు స్థానిక ప్రజా ప్రతినిధుల సాయంతో నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నారు. వీరి సేవలకు మెచ్చిన జీహెచ్ఎంసీ సిబ్బంది వారికి అండగా నిలుస్తున్నారు.. కష్టకాలంలో తమ వంతు సాయం చేస్తున్న మహిళపై మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు.
చేతనైన సాయం... ఎందరికో ఆదర్శం - పేదలకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తున్న మహిళలు
కష్ట కాలంలో తోటి వారికి సాయపడాలంటే డబ్బే ఉండనక్కర లేదు... సాయం చేయాలనే ఆలోచన ఉంటే ఎన్నో మార్గాలు ఉంటాయనడానికి వీరే నిదర్శనం.. కరోనా ప్రభావం వల్ల మాస్కుల ధరలు పెరిగి సామాన్యులకు భారంగా మారింది. ఈ పరిస్థితిని చూసి ఎస్ఆర్ నగర్, బాల్కంపేట పరిధిలో సుమారు 60 మంది మహిళలు జట్టుగా ఏర్పడి మాస్కులు కుట్టి ఉచితంగా పేదలకు పంపిణీ చేస్తున్నారు.
చేతనైన సాయం... ఎందరికో ఆదర్శం