బుధవారం రాత్రి సుమారు పది గంటల సమయం... ఓ నిండు గర్భిణీ.. నొప్పులతో ఆస్పత్రికి వస్తూ ... ఆటోలోనే బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డ బతికే ఉందా? చనిపోయిందో తెలియని పరిస్థితి. ఆస్పత్రికి వచ్చిన వెంటనే సిబ్బంది ఆటోలోనే పుట్టిన పసికందు బొడ్డు తాడు కత్తిరించారు. బిడ్డ చనిపోయిందని నిర్ధరించి తల్లికి వైద్యం చేశారు. కానీ వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని బాధితారాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అయితే ఇందులో వైద్యుల తప్పేమి లేదంటుంది బాధితురాలు. అప్పటికే బిడ్డ మృతిచెందినట్లు తెలిపింది. ఆస్పత్రికి వచ్చిన వెంటనే చికిత్స అందిచినట్లు జిల్లా వైద్య అధికారుల విచారణలోనూ తేలింది.
అసలేం జరిగింది
వాస్తవానికి సబ ఫిర్దోసాకి ఏడో నెల. గర్భం ధరించినప్పటి నుంచి మలక్పేట ఆస్పత్రిలోనే చికిత్స చేయించుకుంటోంది. అప్పటికే ఆమెకు బీపీ ఎక్కువ ఉండటం వల్ల ఈ నెల16న కోఠీ ప్రసూతి వైద్యశాలకు వెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. ఈ మేరకు రిఫరెన్స్ లేఖను కూడా ఇచ్చారు. అయితే కోఠి ఆస్పత్రికి వెళ్లిన సబా... అక్కడ క్యూలైన్లకు భయపడి ఆరోగ్యం సహకరించక పోయినా ఇంటికి వెళ్లిపోయింది. బుధవారం సాయంత్రం నొప్పులు రావటం వల్ల రాత్రి 9గంటలకు మలక్పేట ఆస్పత్రికి ఆటోలో బయలుదేరింది. తనకు ఆటోలోనే ప్రసవం అయిందని బాధితురాలు చెబుతుంటే ఆమె భర్త మాత్రం వైద్యులు అరగంట ఆలస్యంగా వైద్యం చేయడం వల్ల బిడ్డని కోల్పోవాల్సి వచ్చిందని అంటున్నాడు.
ఎవరు బాధ్యులు