నగరంలో నిన్న రాత్రి పలు చోట్ల కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మణికొండలో ఓ వ్యక్తి డ్రైనేజీ పైపులైన్ కోసం తవ్విన గుంతలో పడి గల్లంతయ్యాడు. డీఆర్‌ఎఫ్ బృందాలు రాత్రే రంగంలోకి దిగి గాలింపు చేపట్టిన విషయం తెలిసిందే. 15 మందితో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందం గాలింపు చర్యలు చేపట్టింది. 15 గంటలుగా రెస్క్యూటీమ్ గాలిస్తోంది. తూములు వెళ్లి కలిసే చోట కూడా ఆ వ్యక్తి కోసం చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నెక్నాంపూర్ చెరువు వద్ద మరో బృందం గాలిస్తోంది. నీటి ప్రవాహం ఎక్కువ ఉండటంతో అతడు చెరువు వరకూ వెళ్లే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
హైదరాబాద్ మణికొండలో గల్లంతైన వ్యక్తి గోపిశెట్టి రజనీకాంత్‌గా గుర్తించారు. సంఘటనాస్థలానికి 50 మీటర్ల దూరంలోనే రజనీకాంత్ ఇల్లు ఉంది. ఆయన షాద్‌నగర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. నిన్న రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన రజనీకాంత్... డ్రైనేడీలో పడిపోయాడు.