తెలంగాణ

telangana

ETV Bharat / state

'హైకోర్టు చెప్పినట్లుగానే రీపోస్టుమార్టమ్ జరుగుతోంది' - రీ పోస్టుమార్టాన్ని ఎయిమ్స్ బృందమే వీడియో చిత్రీకరణ చేసింది

రీపోస్టుమార్టం ప్రక్రియ అంతా కోర్టు ఆదేశాల ప్రకారమే జరుగుతోందని గాంధీ సూపరింటెండెంట్‌ పేర్కొన్నారు. రీ పోస్టుమార్టాన్ని ఎయిమ్స్ బృందమే వీడియో చిత్రీకరణ చేసిందని తెలిపారు. ప్రతి అంశం రికార్డు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

The video was filmed by the AIIMS team
'రీ పోస్టుమార్టాన్ని ఎయిమ్స్ బృందమే వీడియో చిత్రీకరణ చేసింది'

By

Published : Dec 23, 2019, 1:04 PM IST

Updated : Dec 23, 2019, 1:36 PM IST

దిశ నిందితుల రీపోస్టుమార్టంనుదిల్లీ ఎయిమ్స్ నుంచి వచ్చిన ఒక సీనియర్ అసిస్టెంట్​తో పాటు ముగ్గురు ఫోరెన్సిక్ నిపుణులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. నిందితుల బంధువులతో మాట్లాడిన తర్వాత మృతదేహాలను వారు గుర్తుపట్టిన అనంతరం పోస్టుమార్టం ప్రక్రియను ప్రారంభించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్ తెలిపారు. నిందితుల అభ్యర్థనను కూడా రికార్డు చేశారన్నారు.

ఈ పోస్టుమార్టం ప్రక్రియలో గాంధీ ఆసుపత్రికి చెందిన వైద్యులెవరూ పాల్గొనడం లేదని శ్రవణ్‌ కుమార్ వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారంగా సాయంత్రం 4గంటలలోపు పూర్తి చేస్తామన్నారు. రీ పోస్టుమార్టం చాలా పారదర్శకంగా జరుగుతోందన్నారు. గత పోస్ట్ మార్టం రిపోర్టులను అడిగారని వాటిని కోర్టుకు పంపించినట్లు చెప్పామని తెలిపారు.

ఒక్కో మృతదేహం పోస్టుమార్టం చేయడానికి 40నిమిషాల సమయం పడుతుందన్నారు. పోస్టుమార్టం తర్వాత హైకోర్టు ఆదేశించిన విధంగా... రెండు అంబులెన్స్‌లలో వాళ్ల గ్రామాలకు పంపడానికి ఏర్పాట్లు చేసినట్లు సూపరింటెండెంట్ చెప్పారు.

'రీ పోస్టుమార్టాన్ని ఎయిమ్స్ బృందమే వీడియో చిత్రీకరణ చేసింది'

ఇదీ చూడండి : హైదరాబాద్​లో సీసీఎస్ ఎస్​ఐ ఆత్మహత్య

Last Updated : Dec 23, 2019, 1:36 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details