తెలంగాణ

telangana

ETV Bharat / state

'గవర్నర్​పై వైద్య విద్యార్థిని సోదరి ఫైర్'.. క్లారిటీ ఇచ్చిన రాజ్​భవన్

Raj Bhavan response to the case of the medical student: కేఎంసీ వైద్య విద్యార్థిని ఘటనలో బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన తీరును బాధితురాలి సోదరి ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీనిపై రాజ్​భవన్​ స్పందించింది. పూలదండతో ఎందుకు వెళ్లారో స్పష్టతను ఇచ్చింది.

Telangana Raj Bhavan
తెలంగాణ రాజ్​భవన్​

By

Published : Feb 24, 2023, 4:50 PM IST

Raj Bhavan response to the case of the medical student: నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని పరామర్శించేందుకు గవర్నర్ తమిళిసై పూలదండతో వచ్చారని బాధితురాలి సోదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోదరిని ఆస్పత్రి పాలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, తక్షణమే ప్రత్యేక కమిటీని నియమించి కేఎంసీ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

మా సోదరిని రాజకీయ నాయకులెవరు పరామర్శించడానికి రాకండి:బాధితురాలికి అన్యాయం చేస్తే తమ సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధమవుతామని ఆమె హెచ్చరించారు. అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థినికి సరైన వైద్యం అందడం లేదని, మంత్రులు, ఎమ్మెల్యేలెవరూ పరామర్శించడానికి రావొద్దని కోరారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు సైఫ్​ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి సోదరి ఆందోళన వ్యక్తం చేశారు.

రాజ్​భవన్​ స్పందన:నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని పరామర్శించేందుకు గవర్నర్ పూలదండతో పచ్చారని జరుగుతున్న ప్రచారాన్ని రాజ్​భవన్ తీవ్రంగా ఖండించింది. ఖైరతాబాద్​లోని హనుమంతుడి గుడిలో సమర్పించడానికి కారులో పూలదండ ఉంచామని స్పష్టం చేసింది. గవర్నర్ వేరే ప్రదేశాల నుంచి రాజ్​భవన్​కు తిరిగి వచ్చేటప్పుడు ఖైరతాబాద్​లోని హనుమంతుడి గుడికి వెళ్లి రావడం చాలా రోజుల నుంచి ఆనవాయితీగా ఉందని వివరించింది.

దుష్ప్రచారం చేయవద్దు.. సరైన దృష్టితో ఆలోచించండి: ఈ విషయాన్ని దుష్ప్రచారం చేస్తూ విపరీతార్థాలు తీయడం సహేతుకం కాదని పేర్కొంది. అలాగే హనుమంతుడి గుడిలో బాధితురాలు త్వరగా కోలుకోవాలని గవర్నర్ ప్రార్థించారని తెలిపింది. గవర్నర్​ రాజ్​భవన్​కు వచ్చిన వెంటనే ఈ ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు సమగ్రంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా ఆదేశించారని తెలిపింది. గవర్నర్ నిమ్స్ పర్యటనను సరైన దృష్టితో అర్థం చేసుకోవాలని రాజ్​భవన్ విజ్ఞప్తి చేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details