తెలంగాణ

telangana

ETV Bharat / state

ద్రౌపది ముర్ముపై రాసిన ‘ఆదివాసీ టు ఆదినాగరిక్‌’ కవితా సంపుటి ఆవిష్కరణ - ఆదివాసీ టు ఆదినాగారిక్

Collection of poems on President Murmu was unveiled: ప్రస్తుత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ఆంధ్రప్రదేశ్​కి చెందిన ప్రముఖ భాషావేత్త డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ రచించిన "ఆదివాసీ టు ఆదినాగారిక్" అనే కవితా సంకలనాన్ని ఈరోజు విశాఖపట్నంలో విడుదల చేశారు. కార్యక్రమంలో విశాఖపట్నం మేయర్ జి హరి వెంకట కుమారి మాట్లాడుతూ.. మహిళలు ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల వారు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో విశేష పాత్ర పోషిస్తున్నారని అన్నారు.

ఆదివాసీ టు ఆదినాగరిక్
ఆదివాసీ టు ఆదినాగరిక్

By

Published : Dec 6, 2022, 9:14 PM IST

Updated : Dec 6, 2022, 9:43 PM IST

Collection of poems on President Murmu was unveiled: ప్రస్తుత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ఆంధ్రప్రదేశ్​కి చెందిన ప్రముఖ భాషావేత్త డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ రచించిన "ఆదివాసీ టు ఆదినాగరిక్" అనే కవితా సంకలనాన్ని విశాఖపట్నంలో ఈరోజు విడుదల చేశారు. కార్యక్రమంలో విశాఖపట్నం మేయర్ జి హరి వెంకట కుమారి మాట్లాడుతూ మహిళలు ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల వారు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో విశేష పాత్ర పోషిస్తున్నారని అన్నారు.

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవిత ప్రయాణం సమాజంలోని అణగారిన మహిళలకు స్ఫూర్తిదాయకమని మేయర్ అన్నారు. భారత రాష్ట్రపతిపై కవితా సంకలనాన్ని వెలువరించిన డా.అభిషేక్ మరెందరికో స్ఫూర్తిని నింపేందుకు, వారిని చైతన్యవంతులను చేసేందుకు మేయర్ అభినందనలు తెలిపారు. రచయిత డాక్టర్ కృష్ణవీర్ అభిషేక్ మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నతికి రాష్ట్రపతి చేస్తున్న కృషి ప్రశంసనీయమని, ఆమె జాతికే గర్వకారణమన్నారు. ఉచిత న్యాయసేవా సమన్వయకర్త పి.రాజేశ్వరి పాల్గొన్నారు.

ఇవీ చదవడి:

Last Updated : Dec 6, 2022, 9:43 PM IST

ABOUT THE AUTHOR

...view details