తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్‌ టీకాల సరఫరాకు గ్లోబల్‌ టెండర్లు ఆహ్వానించిన ప్రభుత్వం - telangana news

government invites the global tenders for covid vaccination supply
కొవిడ్​ టీకాల సరఫరాకు గ్లోబల్​ టెండర్లకు ఆహ్వానం

By

Published : May 19, 2021, 11:57 AM IST

Updated : May 19, 2021, 2:24 PM IST

11:55 May 19

కొవిడ్‌ టీకాల సరఫరాకు గ్లోబల్‌ టెండర్లు ఆహ్వానించిన ప్రభుత్వం

రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత సమస్య పరిష్కారానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తూ టీఎస్ఎంఐడీసీ విధివిధానాలను జారీ చేసింది. కోటి వ్యాక్సిన్ డోసులను రాష్ట్ర ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుందని టెండర్ నియమాల్లో పేర్కొంది. అర్హులైన వారు టీఎస్ఎంఐడీసీ అధికారిక వెబ్​సైట్ నుంచి టెండర్ ఫామ్​ను డౌన్ లోడ్ చేసుకోవచ్చని ప్రకటనలో వెల్లడించింది. ఆన్​లైన్ విధానంలో జరిగే ఈ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనాలనుకునే వారు తప్పక వారి దరఖాస్తులను ఈ ప్రొక్యూర్​మెంట్​ పోర్టల్​లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.  

నెలకు కనీసం 15 లక్షలు.. 

మే 21 నుంచి జూన్ 4 వరకు ఆన్​లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నట్టు తెలిపిన టీఎస్ఎంఐడీసీ.. ఆ రోజు సాయంత్రం ఆరున్నర గంటలలోపు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే టెండర్ ప్రక్రియలో పాల్గొనే  అర్హత ఉంటుందని స్పష్టం చేసింది. మొత్తం 180 రోజుల వ్యవధిలో టెండర్లకు ప్రభుత్వం ఆహ్వానం పలికింది. నెలకు కనీసం 15లక్షల డోసుల చొప్పున 6 మాసాల్లో కోటి డోసులు ఇవ్వాలని టెండర్ నియమాల్లో పేర్కొంది. ఇక ఆన్​లైన్ బిడ్డింగ్​లో పాల్గొనాలనుకునేవారికి ఈ నెల 26 ప్రీ బిడ్ సమావేశాన్ని ఆన్​లైన్ ద్వారా నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది.  

ఇదీ చదవండి:కాసేపట్లో గాంధీ ఆస్పత్రికి వెళ్లనున్న సీఎం కేసీఆర్‌

Last Updated : May 19, 2021, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details