తెలంగాణ

telangana

ETV Bharat / state

Jagan cases: సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ - Andhra News

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ హైదరాబాద్​లోని సీబీఐ, ఈడీ కోర్టులో జరిగింది. అరబిందో, హెటిరోపై ఈడీ కేసులో అభియోగాల నమోదుపై విచారణ చేపట్టారు. అరబిందో, హెటిరో ఈడీ కేసులో జగన్ పిటిషన్‌పై విచారణ ఈనెల 22కి వాయిదా పడింది.

Jagan cases
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

By

Published : Jun 11, 2021, 9:41 PM IST

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. అరబిందో, హెటిరోపై ఈడీ కేసులో అభియోగాల నమోదుపై విచారణ చేపట్టారు. తదుపరి విచారణను సీబీఐ, ఈడీ కోర్టు ఈనెల 22కి వాయిదా వేసింది. అరబిందో మాజీ కార్యదర్శి చంద్రమౌళి ఇటీవల కరోనాతో మృతిచెందారు. చంద్రమౌళి నిందితుడిగా ఉన్నట్లు న్యాయవాది ఇటీవల కోర్టుకు తెలిపారు. చంద్రమౌళి మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని ఈడీని కోర్టు ఆదేశించింది.

అరబిందో, హెటిరో ఈడీ కేసులో జగన్ పిటిషన్‌పై విచారణ ఈనెల 22కి వాయిదా పడింది. తన బదులు న్యాయవాది హాజరుకు అనుమతించాలన్న జగన్ పిటిషన్ వాయిదా పడింది. రాంకీ కేసులో డిశ్చార్జ్ పిటిషన్‌పై కోర్టు విజయసాయిరెడ్డి వాదనలు విన్నది. విజయసాయిరెడ్డి వాదనల కొనసాగింపుపై విచారణ ఈనెల 15కి వాయిదా పడింది. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు, వాన్‌పిక్ కేసుల విచారణను కూడా న్యాయస్థానం ఈనెల 15కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:Arrest: అనుమతి లేకుండా విత్తనాల వ్యాపారం, రూ.17లక్షల సరుకు స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details