కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో నగరంలోని ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. గోపాలపురం ట్రాఫిక్ పోలీసులు చిలకలగూడ కూడలి వద్ద వాహనదారులు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచించారు.
నిర్లక్ష్య ధోరణికి తప్పదు మూల్యం ..! - hyderabad traffic police awareness
సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడ కూడలి వద్ద ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని వాహనదారులకు సూచించారు.
గోపాలపురం ట్రాఫిక్ పోలీసులు
ఇప్పటికీ చాలామంది ప్రయాణికులు మాస్క్ లేకుండానే ప్రయాణిస్తున్నారని తెలిపారు. కోవిడ్ నిబంధనలను అనుసరించని పక్షంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:బరువు తగ్గాలంటే ఈ పద్ధతులే బెస్ట్!