రాష్ట్రంలో విద్యా సంస్థలను మూసివేయడం దారుణమని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ స్టేట్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
'విద్యా సంస్థలను మూసివేయడం దారుణం' - hyderabad latest news
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ అకాడమీ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ పాల్గొన్నారు.
!['విద్యా సంస్థలను మూసివేయడం దారుణం' jaajula srinivas goud on education institutions](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11214132-415-11214132-1617106388216.jpg)
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్
రాజకీయ పార్టీ సమావేశాలకు రాని కరోనా.. విద్యాలయాలకు ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో విద్యా సంస్థలు తెరచి ఉంటే తెలంగాణలో విద్యా సంస్థల ఎందుకు మూసివేశారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యా సంస్థలను పునఃప్రారంభించాలని ఆయన కోరారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తంగా చేస్తామని జాజుల శ్రీనివాస్ హెచ్చరించారు.
ఇదీ చదవండి:యాదాద్రి ఆలయంలో మరో 10 మంది ఉద్యోగులకు కరోనా