తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 26న ఛలోబస్ భవన్‌' - rtc news

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో తెరాస ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ మజ్దూర్ యూనియన్ మండిపడింది. ఆర్టీసీలో వేతన సవరణను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26న ఛలో బస్ భవన్‌ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. కార్మికులకు న్యాయం జరిగే వరకు దశలవారీగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ స్పష్టం చేశారు.

tjmu
'ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేవరకు పోరాటం ఆగదు'

By

Published : Feb 12, 2021, 1:52 PM IST

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో తెరాస ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ మజ్దూర్ యూనియన్ మండిపడింది. కార్మికుల వేతన సవరణను వెంటనే ప్రకటించాలని, ఉద్యోగ భద్రతకు సంబంధించిన సూచనలను సవరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26న ఛలోబస్ భవన్‌ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. హైదరాబాద్ విద్యానగర్‌లోని యూనియన్ కార్యాలయంలో ఉద్యోగుల, కార్మికుల సమావేశం జరిగింది.

2017 ఏప్రిల్ లో జరగాల్సిన పీఆర్సీ ఇప్పటి వరకూ జరగకపోవడంపై యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ మండిపడ్డారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు దశలవారీగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు టి.సుధాకర్, స్వాములయ్య, బీహెచ్ఈఎల్ సీనయ్య, నారాయణమూర్తి, గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:మంత్రి శ్రీనివాస్​గౌడ్​, సీపీ అంజనీకుమార్ టగ్ ఆఫ్ వార్​

ABOUT THE AUTHOR

...view details