good governance ranks: కేంద్రం విడుదల చేసిన గుడ్ గవర్నెన్స్ సూచీలో తెలంగాణ మిగిలిన రాష్ట్రాల కన్నా ఉత్తమ ప్రతిభ కనబరిచింది. పారిశ్రామికీకరణ, వాణిజ్యం, సోషల్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కేటగిరీల్లో మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం పది రంగాల్లో గుడ్ గవర్నెన్స్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ప్రథమ స్థానం దక్కింది. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వాలకు కేంద్రం ఏటా ఈ ర్యాంకులను ప్రకటిస్తూ వస్తోంది.
good governance ranks to TS: గుడ్ గవర్నెన్స్.. రాష్ట్రానికి రెండు కేటగిరీల్లో మొదటిస్థానం - గుడ్ గవర్నెన్స్ సూచీలో మెరుగైన తెలంగాణ
good governance ranks:కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గుడ్ గవర్నెన్స్ సూచీలో రాష్ట్ర ప్రభుత్వం సత్తా చాటింది. రెండు కేటగిరీల్లో అన్ని రాష్ట్రాల కన్నా మెరుగైన స్థానంలో నిలిచింది. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వాలకు కేంద్రం ఏటా ఈ ర్యాంకులను ప్రకటిస్తూ వస్తోంది.

telangana in good governance: పారిశ్రామికీకరణ, వ్యాపార అభివృద్ధి కేటగిరీల్లో తెలంగాణ ప్రభుత్వానికి మొదటి ర్యాంకు దక్కింది. ఇందుకు ఇక్కడి పరిశ్రమల అభివృద్ధి, స్టార్టప్ ఎన్విరాన్మెంట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మెరుగైన స్థానం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పనితీరు అంశాల ఆధారంగా ఈ ర్యాంకును తెలంగాణ కైవసం చేసుకుంది. ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత, నిరుద్యోగ రేటు, హౌసింగ్ ఫర్ ఆల్, లింగ సమానత్వం, ఎకానమిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ వుమెన్ సూచీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచినందుకు సోషల్ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కేటగిరీలో తెలంగాణ ప్రభుత్వానికి మొదటిస్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వాల పాలనలోని పది రంగాలకు గానూ 58 సూచీలతో అంచనా వేసి ఈ ర్యాంకులను కేటాయిస్తోంది. ఈ ఏడాదిలో గుడ్ గవర్నెన్స్ ర్యాంకులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిల్లీలో ప్రకటించారు.