ఒక అభ్యర్థికే రెండు కొలువులు రావడం.. ఇతర శాఖల్లోని ఉద్యోగాలకు ఎంపిక కావడం.. కొన్ని విభాగాల్లో అర్హులైన వారు లేకపోవడం తదితర కారణాలతో వందల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కావడం లేదు. ఇప్పటివరకు టీఆర్‌టీలో సుమారు 700 మందికి ఉద్యోగాలు దక్కినా చేరలేదు.
స్కూల్ అసిస్టెంట్లలో సుమారు 200 మంది, ఎస్‌జీటీ తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో 400 మంది వరకు కొలువుల్లో చేరకపోవడం వల్ల ఆ మేరకు పోస్టులు ఖాళీగా ఉండనున్నాయి. ఆ ఖాళీలను విద్యాశాఖ మరో మెరిట్ జాబితా ప్రకటించి భర్తీ చేయడం లేదు. ఫలితంగా మరో టీఆర్‌టీ ప్రకటన వెలువడే వరకు అవి ఖాళీగానే ఉండనున్నాయి.