తెలంగాణ

telangana

ETV Bharat / state

జాతీయ సగటు కంటే రాష్ట్రం మెరుగు

కరోనా కష్టకాలంలోనూ స్థూల ఉత్పత్తి(జీఎస్​డీపీ), తలసరి ఆదాయంలో రాష్ట్రం వృద్ధి సాధించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.9,78,373 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. వృద్ధి రేటు 1.35 శాతంగా విశ్లేషించింది. జాతీయ సగటు కంటే ఎక్కువగా.. 2020-21లో తలసరి ఆదాయం రూ. 2,27,145గా ప్రకటించింది.

The telangana gdp higher than the national average income
జాతీయ సగటు కంటే రాష్ట్రం మెరుగు

By

Published : Mar 2, 2021, 2:31 AM IST

కరోనా తదనంతర పరిణామాల నేపథ్యంలో నెలకొన్న కష్టకాలంలోనూ స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయంలో రాష్ట్రం వృద్ధి సాధించింది. జాతీయ సగటు తగ్గుదల నమోదు కాగా.. రాష్ట్రం మాత్రం రెండు అంశాల్లోనూ వృద్ధి సాధించింది. ఈ మేరకు రాష్ట్ర అర్థ, గణాంకశాఖ.. ఈ వివరాలను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖకు అందించింది.

ఆ వివరాల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరానికి జీఎస్​డీపీ 9,78,373 కోట్ల రూపాయలుగా పేర్కొంది. 2019-20 జీఎస్​డీపీ అయిన 9,65,355 లక్షల కోట్లపై వృద్ధిరేటు 1.35 శాతంగా తెలిపింది. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో జీడీపీ 203.51 లక్షల కోట్ల నుంచి.. 3.8 శాతం తగ్గి 195.86 లక్షల కోట్లుగా నమోదైంది.

ఇక రాష్ట్రంలో తలసారి ఆదాయం విషయానికి వస్తే... 2020-21లో 2,27,145 రూపాయలుగా తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సర తలసరి ఆదాయం 2,25,756 రూపాయల నుంచి.. 0.61 శాతం వృద్ధి నమోదైనట్లు వివరించింది. జాతీయ సగటు తలసరి ఆదాయం 1,34,186 రూపాయల నుంచి... 4.8 శాతం మేర 1,27,768 రూపాయలకు తగ్గింది.

ఇదీ చూడండి :జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏసీఐ అవార్డు

ABOUT THE AUTHOR

...view details