రాష్ట్రంలో గత రెండు రోజులుగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈరోజు దక్షిణ కోస్తాంధ్ర పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 29 శాతం అధికంగా వర్షపాతం నమోదైందన్నారు.
ఉపరితల ఆవర్తనం.. ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం - హైదరాబాద్ వాతావరణ శాఖ తాజా సమాచారం
దక్షిణ, కేంద్రీయ తెలంగాణ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు.. పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. ఇప్పటికే ఉన్న షియర్‌జోన్(వ్యతిరేక పవనాలు ఎదురుపడే ప్రాంతం) ప్రభావంతోపాటు దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల అవర్తనం ఏర్పడిందన్నారు. ఈ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయంటున్న వాతావరణ శాఖ అధికారి రాజారావుతో మా ఈటీవీ భారత్ ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి...
ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం
ఇవాళ వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన వివరించారు.
ఇదీ చూడండి :రాష్ట్ర అధికారులతో కేంద్ర బృందం సమావేశం