తెలంగాణ

telangana

ETV Bharat / state

'దిశ' నిందితుల ఎన్​కౌంటర్​పై విచారణకు సుప్రీం నిరాకణ - దిశ కేసు పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు

దిశకేసు నిందితుల ఎన్​కౌంటర్​పై దాఖలైన పిటిషన్​ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కమిషన్ వేశామని సుప్రీం వెల్లడించింది.

The Supreme Court refused to hear the disha case petition
దిశ కేసు పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు

By

Published : Dec 17, 2019, 1:40 PM IST

దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కమిషన్ వేశామని వెల్లడించింది. తెలంగాణ హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతించాలని పిటిషనర్ కోరగా... ధర్మాసనం అనుమతినిచ్చింది. కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు సేకరించి భద్రపరచాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. ఆధారాల సేకరణపై తెలంగాణ హైకోర్టు సరైన ఆదేశాలు ఇస్తోందని సుప్రీంకోర్టు తెలిపింది. సామాజిక కార్యకర్త సజయ సహా పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details