Minister Koppula Eshwar Case మంత్రి కొప్పులకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ - Hyderabad Latest News
22:03 August 17
Minister Koppula Eshwar Case మంత్రి కొప్పులకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
Minister Koppula Eshwar Case: మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తలిగింది. మంత్రి కొప్పుల వేసిన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. 2018 ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల అవకతవకలపై హైకోర్టులో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పిటిషన్ వేశారు. వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని లక్ష్మణ్‌కుమార్ అందులో పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పిటిషన్ కొట్టివేయాలని మంత్రి కొప్పుల హైకోర్టు మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంత్రి కొప్పుల అభ్యర్థనను న్యాయస్థానం కొట్టివేసింది. హైకోర్టు ఆర్డర్‌ను సవాల్ చేస్తూ కొప్పుల ఈశ్వర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇరువురి వాదనలు విన్న అనంతరం మంత్రి పిటిషన్ కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చదవండి:KTR Tweet Today మహిళల పట్ల ప్రధాని మోదీకి గౌరవం ఉందా